Arya Vysya Kannada Digital Magazine

Arya Vysya NRI magazine

Home / Devotional / Govinda Seva – Arya Vysya New Choultry, Dharmavaram

Govinda Seva – Arya Vysya New Choultry, Dharmavaram

(ధర్మవరం నియోజకవర్గం) గోవింద నామస్మరణతో మారుమోగిన ఆర్యవైశ్య కొత్త సత్రం ధర్మవరం అర్బన్ నవంబర్ 11 ప్రభ న్యూస్ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో గురువారం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా ఆర్యవైశ్య కొత్త సత్రం లో పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి విశేష లడ్డు పూజ, తిరుప్పావడ సేవ, గోవిందుని తులాభారం తదితర విశేష పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 9 అడుగుల తో గంధముతో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా ప్రతిష్టించారు. అనంతరం 33,000 లడ్డూలతో లడ్డు పడి పూజ, 160 కేజీల పులిహోర తో తిరుప్పావడ సేవ, గోవిందుని తులాభారం తదితర ప్రత్యేక కార్యక్రమాలను 108 మంది మహిళలతో తిరుమల తిరుపతి సాంప్రదాయాలకు అనుగుణంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా మహాగణపతి పూజ, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి, తదితర పూజా కార్యక్రమాల అనంతరం మహా మంగళ హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు పోడా మల రూప రాగిణి , కార్యదర్శి తోట శశికళ, కోశాధికారి నల్ల పేట మంజు సంయుక్త, ఆర్యవైశ్య సంఘం , ఆర్యవైశ్య యువజన సంఘం, భజన మండలి, నగర సంకీర్తన మండలి సభ్యులు పాల్గొన్నారు. ఫోటో రైట్ అప్… డి ఎం ఎం… ప్రత్యేక అలంకరణలో పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి… పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు… వెంకటేశ్వర స్వామికి లడ్డు పూజ నిర్వహిస్తున్న దృశ్యం.

About DVS Rao

Check Also

Vasavi Foundation, Vanitha Vibhag, Guntur Dist. – Distribution of Rugs and Food to Oldage Home.

జై వాసవి.. అందరికీ నమస్కారములు🙏 నా ప్రియ మిత్రులు అందరికీ శుభ సాయంకాలం🙏Vf Ap Vanitha vibhag n Guntur …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kanigiri Oldage Home

Vasavi Classifieds

Vasavi Foundation