ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆర్యవైశ్య మహాసభ నేతలు
సూళ్లూరుపేట నెలవల విజయశ్రీ కి తిరుపతి జిల్లా రూరల్ ఆర్యవైశ్య మహాసభ నేతలు. ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ జన్మదినం సందర్భంగా మంగళవారం సూళ్లూరుపేట పట్టణంలోని శేష సాయి కళ్యాణ మండపంలో జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ రూరల్ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి గాదం శెట్టి నాగరాజు, అధికార ప్రతినిధి గూడూరు కిరణ్ కుమార్,గంగిశెట్టి శ్రీనివాసరావు, అలవాల శ్రీనివాస్,పైడిమరి కిషోర్, ముక్కాల నాగేశ్వరరావు, గుర్రం ప్రసాద్,పలువురు కార్యవర్గ సభ్యులు, మహిళా అధ్యక్షురాలు కాకిమాను సావిత్రి,మహిళ కార్యవర్గ సభ్యులు పాల్గొని కేక్ కట్ చేసి,ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి శాలవాలు కప్పి,పుష్ప గుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఎమ్మెల్యే విజయ్ శ్రీ గారికి బుక్సు , పెన్సు, విద్యా సామాగ్రి అందజేశారు.