Arya Vysya Kannada Digital Magazine

Arya Vysya NRI magazine

Home / Devotional / వామ్ సింగపూర్ నవరాత్రులలో దేవి పారాయణం

వామ్ సింగపూర్ నవరాత్రులలో దేవి పారాయణం

హిందువులకు దక్షిణాయన కాలంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో విజయదశమి ప్రముఖమైనది. వివిధ ప్రాంతాలలో ఈ పండుగ జరుపుకునే నేపధ్యం కొంత వేరుగా ఉన్నా కూడా, ప్రముఖంగా అమ్మవారు రాక్షససంహారం చేసి చెడుపై మంచిని గెలిపించినందుకు వివిధ దేశాలలో ఉన్న హైందవులందరూ ప్రతి సంవత్సరం శరత్ఋతువులో ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు తొమ్మిది రోజులను నవరాత్రులగా పూజలు చేసి పదవరోజు విజయదశమి జరుపుకుంటారు. సింగపూర్ లో నివసిస్తున్న ఆర్యవైశ్యులు కూడా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లే ఈ సంవత్సరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సింగపూర్ లో ఉన్న హిందూ దేవాలయాలలో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సంవత్సరం దేవినవరాత్రుల సందర్భంగా సింగపూర్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మహిళ విభాగం అధ్వర్యంలో అక్టోబర్ 22, గురువారం నాడు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గం।। నుండి రాత్రి 9 గం।। వరకు అమ్మవారి భక్తి గీతాలాపన చేసారు. ప్రస్తుత పరిస్థితులననుసరించి స్థానిక నిబంధనలకనుగుణంగా మహిళలందరు అంతర్జాల మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోవరోజు ప్రతీకగా మహిళలందరూ పసుపురంగు దుస్తులు ధరించి కార్యక్రమంలో లలిత సహస్రనామ పారాయణం, నవదుర్గ స్తుతి, దేవి స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, లింగాష్టకం, మణిద్వీపవర్ణన, మహిషాసురమర్ధిని స్తోత్రం మరియు ఇతర భక్తి గీతాలాపన చేసారని కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి  అర్చన కిశోర్, దీప భాస్కర్, సుప్రీత పట్టూరి, శ్రీముత్య,

స్వాతి వరగాని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళలు మదిచెట్టి సరితా, అనూష, స్వాతి, పూర్ణిమ, బి దీప, గీత, రష్మీ, శిల్ప, రూప, దివ్య, దేవి, శ్రీముత్య, దీప్తి, స్వప్న, నాగ అంబికా, వసుధ, సూర్య శ్రీ మొ।। వారు పాల్గొన్నారు. ఆద్యంతం వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు వామ్ సింగపూర్ విభాగం అధ్యక్షుడు నల్ల భాస్కర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి పట్టూరి కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు కంకిపాటి శశిధర్, కంచర్ల శరత్, సంకా వెంకట రవి కుమార్, కోశాధికారి సతీష్ వుద్దగిరి, కమిటీ సభ్యులు కోట సతీష్, నంగునూరి వెంకటరమణ తదితరులు  ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేసారు  మరియు వామ్ గ్లోబల్ విభాగం వారు అభినందనలు తెలిపారు

About DVS Rao

Check Also

Satamanam Bhavathi – Smt. Shwetha Ganjam, A.M. – Happy birth day on 31st October, 2021.

Smt. Shwetha Ganjam, A.M. General Secretary and Vice President of Vasavi Foundation and PRO NRI …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kanigiri Oldage Home

Vasavi Classifieds

Vasavi Foundation