శ్రీమాన్ అర్చకం పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితుల వారు ఆచార్య తిరువడి చేరినారు 🙏🏻
అర్చక ధీరులు పరమపదించారు.
ఒక మహనీయ మూర్తి మానవతా విలువలు తెలిసిన ధన్యజీవి వైఖానస లోకపు ధృవతార నేడు రాలిపోయింది.
ఆ పుణ్యాత్ముని జీవితం శ్రీవారికి గోవింద రాజ స్వామి పాదాలకు విఖనోమునీంద్రులకు అంకితమై పరమపావనమై విలసిల్లింది. విఖనో మునీంద్రుల పట్ల నిజమైన వైఖానసుని బాధ్యత ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానమే వారు. చేతిలో డబ్బు ఉన్నదా లేదా అనే ఆలోచన వారికి లేదు ఆచార్య స్వామి ఆలయంలో నిత్య నైవేద్యం జరగాల్సిందే ప్రతియేడు విఖనోమునీంద్రుల ఉత్సవం చేయాల్సిందే. అంతటి నిబద్ధత వారికే చెల్లింది. వైఖానస ప్రపంచంలో ఒక విఖనసముని ఆలయానికి ధర్మకర్తలు మరియు అర్చకులు అయిన వంశం వారిదే.
మానవత్వానికి నిలువెత్తురూపం. పాలపొంగువంటి కోపం. ఆప్యాయమైన మాట వారి సొంతం
ఇంటికి వెళ్లిన మనిషిని భోజనం వడ్డించకుండా పంపని పుణ్యమూర్తి. కల్మషం లేని నిర్మలహృదయుల. ధర్మబద్ధమైన జీవనం నా మార్గమని ఆచరణలో చూపిన పుణ్యాత్ములు వారు. టీటీడీ వారు మీ శరీరానికి 65 సంవత్సరాలు దాటి పోయాయి మీరు అర్చనలు చేయనక్కరలేదు అన్నారు. 25లక్షలు ఇచ్చి ప్రశాంతంగా ఇంట్లో ఉండమన్నారు. ఆయన మనసు ఆ డబ్బు వైపు మరలలేదు మరుసటిరోజు తన అకౌంట్ లో వేసిన డబ్బు తిరిగి టీటీడీ అకౌంట్ కు కట్టి నాకు కావసినది డబ్బు కాదు స్వామి సేవ అని బిగ్గరగా చాటిన అర్చక రత్నం వారు.
కొన్ని రోజుల క్రితం వరకు కూడా స్వామిసేవలో పాలుపంచుకుంటూనే ఉన్నారు. జీవితంలో అన్ని ఎత్తుపల్లాలు చూసారు. ఆదాయాలు ఆస్తులు కరిగిపోతున్నా ధర్మ మార్గాన్ని విడువలేదు.వారిలో మానవత్వం ధైర్యం కొంతకూడా సడలలేదు. మొక్కవోని సంకల్పబలం వారిది. స్వామి సేవకులైన ప్రతి వైఖానస అర్చకుడు వారిని స్పూర్తిగా తీసుకోవాలి. తద్విష్ణో పరమం పదం సదాపశ్యన్తి సూరయ:

వెరీ నైస్
చాల మంది చదువుచున్నారు